గుంటూరు జిల్లా సూర్యలంకలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సహకారంతో.. భారత నావికా దళం విన్యాసాలు చేయనుంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 2 నుంచి 13 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ తీరం వైపుగా ఆర్టిలరీ విన్యాసాలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపింది. తీరం నుంచి వంద కిలోమీటర్ల వరకూ ఎలాంటి నౌకలు, మత్స్యకార బోట్లూ తిరగకుండా అధికారులు సన్నాహాలు చేయనున్నారు. విన్యాసాల సమయంలో తీరప్రాంతంలోని ఆకాశమార్గంలోనూ విమాన రాకపోకలపై ఆంక్షలు విధించారు.
సూర్యలంకలో 2 నుంచి 13 వరకు నౌకదళం విన్యాసాలు - milatary mock drill in suryalanaka
బాపట్ల సూర్యలంక తీరంలో భారత నౌకాదళం విన్యాసాలను నిర్వహించనుంది. డిసెంబరు 2 నుంచి 13 వరకు జరగనున్న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.
బాపట్ల సూర్యలంకలో... వచ్చే నెల 2 నుంచి 13 వరకు భారత నౌకదళం విన్యాసాలు