ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ గ్రామాల్లో భేషుగ్గా సమాచార స్రవంతి - తుళ్లూరు మండలంలో మైక్ వార్తలు

ఆ ప్రాంతంలో వీధిలోకి గ్రామ వాలంటీర్ వచ్చాడంటే క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది.! ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెడితే.... ఎవరికి వర్తిస్తుంద్న సమాచారం ఇట్టే చేరిపోతుంది. పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నారా..? అయితే చంటిపిల్లలున్న ఇళ్లకు ఈ వార్త నిమిషాల్లో పాకేస్తుంది.! ఇందుకోసం వాళ్లు అమలు చేస్తున్న పద్ధతి అందరికీ తెలిసిందే అయినా నిర్వహణ మాత్రం ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఎక్కడ..? ఏంటా విధానం..? ఎలా పని చేస్తుందో తెలుసుకందాం రండి.

mike announcement at  thulluru zone
తుళ్లూరు మండలంలో మైక్ అనౌన్స్​మెంట్

By

Published : Feb 6, 2021, 10:01 AM IST

గ్రామాల్లో ఏదైనా సమాచారం ప్రజలందరికీ తెలియజేయాలంటే ఏం చేస్తారు... పాత పద్ధతిలో అయితే దండోరా వేయిస్తారు. కొత్త పద్ధతిలో అయితే ఏదైనా వాహనానికి మైక్ ఏర్పాటు చేసి ఊరంతా తిరుగుతూ ప్రకటిస్తారు. కానీ గుంటూరు జిల్లాలోని కొన్ని గ్రామాలు సమాచార వ్యాప్తి కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి.

మైకుల ద్వారా అప్రమత్తం

తుళ్లూరు మండలంలో... నిత్యం ఇలాంటి ప్రకటనలు వినిపిస్తూనే ఉంటాయి. గ్రామస్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వాలన్నా మైకుల ద్వారానే తెలియజేస్తారు. కొందరు పనిలో నిమగ్నమై సమాచారం తెలుసుకోలేక ప్రభుత్వ పథకాల లబ్ధి కోల్పోయే అవకాశం ఉంది. అలా జరగకుండా మైకుల ద్వారా అప్రమత్తం చేస్తుంటారు. తుళ్లూరు పరిధిలో.. మొదట ఈ విధానం రాయపూడిలో మొదలుపెట్టారు. ఫలితాలు బాగుండడం వల్ల మిగతా పల్లెల్లోనూ మైకుల శబ్దం వినిపించడానికి ఎంతో సమయం పట్టలేదు. 2008 అక్టోబర్ 12న మండలంలోని ఇతర గ్రామాల్లోనూ 'సమాచార స్రవంతి' పేరుతో అమలు చేశారు

పల్లెల్లో అందరి తెలుస్తుంది

పంచాయతీ కార్యాలయాల్లో 'సమాచార స్రవంతి'కి సంబంధించిన పరికరాలు ఏర్పాటు చేశారు. గ్రామాల్లోని ముఖ్యమైన కూడళ్లలో మైకులు ఏర్పాటు చేసి, పంచాయతీ కార్యాలయాలతో అనుసంధానించారు. ఏదైనా సందేశం ఇస్తే ఇలా పల్లెల్లో అందరి చెవికి చేరుతుంది

పథకాలు, బిల్లులు గురించి

నీటి పన్ను, ఆస్తి పన్ను, కరెంటు బిల్లుల చెల్లింపుల గురించి. మైకుల ద్వారా సమాచారం ఇస్తారు. ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెడితే, ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చో వివరిస్తారు

ఆదాయ వనరుగానూ

ఈ విధానాన్ని కేవలం సమాచారం ఇవ్వడానికే కాకుండా, చిన్నపాటి ఆదాయ వనరుగానూ ఉపయోగిస్తున్నారు. బయటి నుంచి ఎవరైనా వచ్చి ఉత్పత్తులు అమ్ముకోవాలన్నా డబ్బులిచ్చి ఈ మైకుల ద్వారానే ప్రకటిస్తారు

ఒక మండలమంతా ఈ వ్యవస్థ

పల్లెల్లో మైకుల వ్యవస్థ ఉండడం సహజమే అయినా ఒక మండలమంతా ఈ వ్యవస్థను సమర్థంగా వినియోగించడం విశేషం.

తుళ్లూరు మండలంలో మైక్ అనౌన్స్​మెంట్

ఇదీ చూడండి.

తాళ్లచెరువు పంచాయతీ ఏకగ్రీవానికి ప్రయత్నాలు.. రంగంలోకి దిగిన ప్రవాసాంధ్రుడు

ABOUT THE AUTHOR

...view details