గుంటూరులో ఉంటున్న వలస కార్మికులను సోమవారం అర్ధరాత్రి దాటాక రెండు ప్రత్యేక రైళ్లలో స్వస్థలాలకు బయలుదేరారు. రైలులో పయనమమైన వలస కార్మికులతో సబ్ కలెక్టర్ దినేష్ కుమార్, శిక్షణ కలెక్టర్ మౌర్య సదుపాయాల గురించి ఆరా తీశారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వలస కార్మికులకు సూచించారు. చేతిలో డబ్బులు లేకపోయినా, తమకు టిక్కెట్లు కేటాయించి భోజనం సమకూర్చిన ప్రభుత్వానికి ధన్యావాదాలు తెలిపారు. ఈ కరోనా విపత్తు కాలం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదనీ, అందుకే స్వస్థలాలకు వెళ్లి తమ కుటుంబ సభ్యులతోనే ఉండేందుకు వెళ్తున్నామని వలస కార్మికులు వివరించారు.
గుంటూరు నుంచి స్వస్థలాలకు బయల్దేరిన వలస కార్మికులు - గుంటూరు నుంచి స్వస్థలాకు వలస కార్మికులు
ఉపాధి కోసం కుటుంబ సభ్యులను వదిలివచ్చిన వారు ఇప్పుడు అదే ఉపాధిని కాదని, తిరిగి సొంత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. లాక్డౌన్తో సుమారు రెండు నెలలుగా ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ గుంటూరులో ఉంటున్న వలస కార్మికులు ఎట్టకేలకు రెండు ప్రత్యేక రైళ్లలో స్వస్థలాలకు బయలుదేరారు.
![గుంటూరు నుంచి స్వస్థలాలకు బయల్దేరిన వలస కార్మికులు guntur migrate workers to home towns](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7255471-446-7255471-1589858172617.jpg)
గుంటూరు నుంచి స్వస్థలాలకు వలస కార్మికులు
గుంటూరు నుంచి స్వస్థలాలకు బయల్దేరిన వలస కార్మికులు
వలస కార్మికులంతా రాజస్థాన్, బిహార్ ప్రాంతాలకు చెందినవారనీ, పానీపూరి, గోతాలు కుట్టటం,కంపెనీల వద్ద చిన్నపాటి పనులు చేసుకునే వారని సబ్ కలెక్టర్ తెలిపారు.
ఇదీ చదవండి:అన్నదాతల కోసం.. ఎదురుచూపులు