గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెం వద్ద ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి బీహార్‌కు వలస కూలీలతో వెళ్తున్న టెంపో వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టటంతో టెంపో బోల్తా పడింది. దీంతో 10 మంది వలస కార్మికులు గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాపడిన సంజయ్, నితీస్, మనోజ్ కుమార్, జాదన్, అదౌత్, సురేష్‌లకు చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా బీహార్‌లో ధర్మాంగ్ జిల్లాకు వెళ్తున్నట్లు వివరించారు. తమ వాహనాన్ని చిప్స్ లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్ అతి వేగంగా ఢీకొట్టటంతోనే టెంపో బోల్తా పడినట్లు తెలిపారు.
టెంపోను ఢీకొట్టిన ట్రాక్టర్... బీహార్ వలస కార్మికులకు గాయాలు - బోయపాలెం వలస కార్మికుల ప్రమాదం న్యూస్
వలస కార్మికులతో వెళ్తున్న టెంపో వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టటంతో గంటూరు జిల్లా బోయపాలెం వద్ద ప్రమాదం జరిగింది. ఘటనలో 10 మంది వలస కూలీలు గాయపడ్డారు.
వలస కార్మికుల టెంపో బోల్తా