ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Migrant Laborers కూలి కోసం వెళ్లి.. చనిపోతున్నారు! 20 రోజుల్లో ఒకే గ్రామంలో ముగ్గురు బలి.. ఉలిక్కిపడిన వైద్యశాఖ! - పల్నాడు జిల్లా లేటెస్ట్ న్యూస్

Migrant Laborers Died due to Illness: ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లి.. అకాల మృత్యువాత పడుతున్న వలసకూలీలు ఘటన సంచలనంగా మారింది. సొంత రాష్ట్రంలో ఉపాధి లభించక, బతుకు తెరవు కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లి.. తీవ్ర అనారోగ్యంతో మరణిస్తున్నారు. గత 20 రోజుల్లో ఒక్క గ్రామంలోనే ఇలా ముగ్గురు, పక్క గ్రామంలో మరో వ్యక్తి మృతి చెందడంతో.. గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన వైద్య సిబ్బంది.. హుటాహుటిన వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, వలస కూలీలకు వైద్యం చేస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 8, 2023, 9:38 PM IST

Updated : Jun 9, 2023, 8:36 AM IST

Migrant Laborers Died due to Illness: బతుకు తెరవు కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లిన వారిని అనారోగ్య సమస్యలు పీడిస్తున్నాయి. ఉపాధి కోసం వెళ్లిన కూలీల్లో నలుగురు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇలా గత ఇరవై రోజుల్లోనే నలుగురు మృతి చెందిన ఘటన ఆందోళనకు గురి చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

సొంత రాష్ట్రంలో ఉపాధి లభించక, ఒకవేళ లభించినా పనికి తగిన వేతనం లభించట్లేదు. దీంతో రాష్ట్రం నుంచి కొంతమంది ఛత్తీస్​గఢ్ రాష్ట్రానికి వలస కూలీలుగా వెళ్లారు. గుంటూరు జిల్లాలోని డోకి పర్రుకు చెందిన తాటిగిరి రాజశేఖర్ అనే వ్యక్తి కొంతకాలం కిందట ఛత్తీస్​గఢ్​కు ఉపాధి నిమిత్తం వెళ్లాడు. అక్కడ ఇంటి కుళాయి పనుల నిమిత్తం అతడు.. రాష్ట్రం నుంచి కొంతమంది కూలీలను అక్కడకు తీసుకెళ్లటం కొంతకాలంగా జరుగుతుంది.

ఈ క్రమంలో అతడు ఏప్రిల్ 20న డోకి పర్రులకు చెందిన ఆరుగురిని, పల్నాడు జిల్లా ఇరుకుపాలెం గ్రామానికి చెందిన ఓ యువకుడిని తనతో పాటు తీసుకుని వెళ్లాడు. కాగా మే 20న వారంతా స్వస్థలాలకు తిరిగివచ్చారు. అయితే అప్పటినుంచి వారు అనారోగ్యానికి గురయ్యారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వారు చికిత్స పొందుతున్నారు.

కాగా.. వారిలో గుంటూరు జిల్లాకు చెందిన జొన్నకూడి విశ్వనాదం(30) ఇరవై రోజుల కిందట మృతి చెందాడు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకు అదే ప్రాంతానికి చెందిన దేవతోటి దేవదానం(35), గంతెల ఏడుకొండలు(40), పల్నాడు జిల్లాకు చెందిన ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం గ్రామానికి చెందిన గుండ్ర సూర్య(17) వరుసగా మృత్యవాత పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇలా బతుకు తెరవు కోసం పక్క రాష్ట్రాలకు వలస కూలీలుగా వెళ్లి వచ్చినవారు అనారోగ్యంతో వరుసగా మరణించటంతో.. వారు జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధ, గురువారం రెండు రోజులపాటు డోకి పర్రులో వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ క్రమంలో మొత్తం 50 మందికి వైద్య పరీక్షలు చేశారు. కాగా వలస కూలీలుగా వెళ్లినవారు.. పని చేసే ప్రదేశంలో కలుషిత నీటిని తాగతటం వల్లనే అనారోగ్యాలకు గురై మరణించారని వైద్యులు తెలిపారు. ఇలా వలస కూలీలుగా వెళ్లి వచ్చిన వారిలో మరికొంతమంది నరాల బలహీనత, మలేరియాతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.

"మా గ్రామం నుంచి ఏప్రిల్ 20న కొంతమంది ఛత్తీస్​గఢ్​కు వలస కూలీలుగా వెళ్లారు. అక్కడి నుంచి మే 20న తిరిగి స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి వారంతా అనారోగ్య సమస్యలో సతమతమవుతూ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే గత 20 రోజుల్లో నలుగురు వరుసగా మృత్యువాత పడ్డారు. వలస కూలీలుగా వెళ్లిన వారు.. కలుషిత నీటిని తాగటం వల్లే మరణించినట్లు వైద్యులు తెలిపారు." - శ్రీనివాసరావు, డోకి పర్రు గ్రామస్థుడు

Last Updated : Jun 9, 2023, 8:36 AM IST

ABOUT THE AUTHOR

...view details