గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎక్కువగా మిర్చి, పత్తి సాగు చేస్తారు. ఆ పంటలను కోసేందుకు ఇతర జిల్లాల నుంచి వలస కూలీలు వస్తుంటారు. ఈ ఏడాది నియోజకవర్గంలోకి దాదాపు 16 వేల మంది వలస కూలీలు కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చారు. కరోనా ప్రభావంతో సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రయత్నం చేసినా... అధికారులు తమను అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కనీసం ఒక్క వస్తువును కొనే పరిస్థితి తమకు లేదని 'ఈటీవీ భారత్'తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. మూడు నెలల నుంచి పింఛన్ అందలేదని, రేషన్ ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు.
వలస కూలీల కన్నీటి వ్యథలు - లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న వలస కూలీలు
సొంత ఊరు నుంచి కూలిపనుల కోసం జిల్లాలు దాటి వచ్చారు. పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అంతా సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో కరోనా కష్టాలు తెచ్చింది. పనికి వెళ్లి దాచుకున్న కాస్తంత డబ్బు అయిపోయింది. కనీసం తినేందుకు కూడా చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి ఎదురైంది. స్వగ్రామలకు వెళ్లలేని దుస్థితి నెలకొంది. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న వలస కూలీలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
వలస కూలీల కన్నీటి వ్యధలు
ప్రత్తిపాడు వచ్చిన హోంమంత్రి సుచరితను కలిసిన వలస కూలీలు... తమను స్వగ్రామాలకు పంపించాలని వేడుకున్నారు. వారి ఆవేదన అర్థం చేసుకున్న హోంమంత్రి.. స్వగ్రామాలకు తరలించేందుకు చర్యలు చేపడతామని హామీఇచ్చారు. గ్రీన్ జోన్లో ఉన్న వారిని మొదటి విడతగా పరీక్షలు చేసిన అనంతరం బస్సులలో పంపించే ఏర్పాట్లు చేస్తామన్నారు. అందుకు కూలీలు కూడా సహకరించాలని కోరారు.