గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ వద్ద భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేశారు. పెండింగ్ బకాయిలు చెల్లించి, సొంత రాష్ట్రాలకు పంపాలని డిమాండ్ చేశారు. ఎల్‌అండ్‌టీ కార్యాలయం, సిబ్బందిపై దాడికి యత్నించారు. సిబ్బంది ఓ గదిలో ఉండి తలుపులు వేసుకుని అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు, తహసీల్దార్ ఘటనాస్థలానికి చేరుకుని సర్ధిచెప్పారు. 3 రోజుల్లో స్వస్థలాలకు పంపుతామన్న హామీతో కార్మికులు ఆందోళన విరమించారు. వలస కార్మికులంతా బిహార్, ఝార్ఖండ్, యూపీ, బంగాల్‌కు చెందినవారిగా తెలుస్తోంది.
ఎయిమ్స్ సిబ్బందిపై దాడికి యత్నించిన వలస కూలీలు - మంగళగిరి ఎయిమ్స్ వద్ద వలస కూలీల ఆందోళన
బిహార్, ఝార్ఖండ్, యూపీ, బంగాల్‌కు చెందిన వలస కార్మికులు మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఆందోళనకు దిగారు. పెండింగ్ బకాయిలు చెల్లించి, సొంత రాష్ట్రాలకు పంపాలని నిరసన చేశారు. సిబ్బందిపై దాడి యత్నించగా పోలీసులు వారికి సర్ధిచెప్పారు. మూడు రోజుల్లో స్వస్థలాలకు పంపుతామని హామీఇచ్చారు.
ఎయిమ్స్ సిబ్బందిపై దాడికి యత్నించిన వలసకూలీలు