ఏపీ, తెలంగాణా, గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్... ఇలా రాష్ట్రం ఏదైనా సరే... రహదారుల వెంట నడుస్తున్న వలస కార్మికులు... రైలు పట్టాల వెంట పిల్లాపాపలతో సాగిపోతున్న కూలీలే కనిపిస్తున్నారు. నడవటం గొప్పా అనిపించొచ్చు. రోజూ రెండు కిలోమీటర్లు నడిస్తే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్పినా చాలామందికి చెవికెక్కదు. కొంతమంది కొద్దిరోజులు చేస్తారు. మరికొన్ని రోజులు ఆపేస్తారు. అయితే ఎవరూ నడిచినా నాలుగైదు కిలోమీటర్లకు మించదు. కానీ ఇపుడు వలస కార్మికులు మాత్రం వందల కిలోమీటర్లు నడుస్తున్నారు. కాలి నడకన సాగుతున్న వారంతా నెత్తిన బ్యాగులు పెట్టుకుని వెళ్తున్నారు. మరికొందరు పిల్లల్ని బుజాలపై ఎక్కించుకుంటున్నారు. కాలికి సరైన చెప్పులుండవు. అయినా అలుపెరగని బాటసారుల పయనం సాగుతోంది. అసలు అంత దూరం ఎలా నడవగలుగుతున్నారు. వారి శరీరం ఏమైనా ప్రత్యేకమా... వారి మనోనిబ్బరం ఏంటి?
- శారీరక సామర్థ్యం
వలస కూలీలంతా శారీరక శ్రమకు అలవడిన వారే.
స్వేదాన్ని పెట్టుబడిగా, రక్తాన్ని ముడిసరుకుగా మార్చి దేశ నిర్మాణంలో భాగమయ్యారు.
పరిశ్రమల్లో, నిర్మాణ పనుల వద్ద నిరంతరం కష్టించి పని చేస్తుంటారు.
అందుకే వారి కండరాలు ఎపుడూ చైతన్యంగా ఉంటాయి.
శరీరంలో చెడు కొవ్వు వంటిది ఉండదు.
బీపీ, షుగర్ వంటి జబ్బులు దరిచేరవు.
శారీరక శ్రమ చేస్తుంటారు కాబట్టే సులువుగా నడవగలుగుతున్నారు.
- మానసిక స్థైర్యం
వీరందరూ మానసికంగా చాలా దృఢంగా ఉంటారు.
తప్పనిసరి పరిస్థితులే వీరిలో మానసిక ధృడత్వాన్ని పెంచుతాయి.
రేపటి గురించి ఆలోచించరు.
సొంతూరికి చేరుకోవాలనే గమ్యం మాత్రమే కనిపిస్తుంది