గుంటూరు జిల్లా మంగళగిరిలో అంతర్రాష్ట్ర వలసకూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిహార్, పశ్చిమ్‌బంగ, రాజస్థాన్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు లాక్‌డౌన్‌తో చిక్కుకున్నారు. స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రభుత్వాలు సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ.. అధికారుల మధ్య సమన్వయ లోపంతో తాము ఇళ్లకు వెళ్లలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. లాక్డౌన్ వల్ల పనులు లేవని, తమ యజమానులు పట్టించుకోవడం లేదని వాపోయారు.
అధికారుల సమన్వయ లోపం.. వలస కూలీలకు శాపం..! - మంగళగిరిలో వలస కూలీల ఆందోళన
ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి గుంటూరు జిల్లా మంగళగిరికి వచ్చిన వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తమను ఇంటికి పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

నిరసన వ్యక్తం చేస్తున్న వలస కూలీలు