గుంటూరు జిల్లా పానకాల ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పని చేస్తున్న మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. 3 సంవత్సరాలుగా చిప్పగిరి గురమ్మ అనే మహిళ మధ్యాహ్న భోజన పథకం వంటమనిషిగా పనిచేస్తోంది. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి స్థానిక నేతలు ఆమెను విధుల నుంచి తప్పుకోవాలని బెదిరిస్తున్నట్లు బాధితురాలి బంధువులు తెలిపారు. లేని పక్షంలో 6నెలల నుంచి పెండింగ్ లో ఉన్న జీతాన్ని నిలుపుదల చేయిస్తామంటూ వేధిస్తున్నారని ఆరోపించారు. మనస్థాపం చెందిన మహిళ... సోమవారం ఉదయం పాఠశాల ఆవరణలో పురుగుల మందు తాగినట్లు తెలిపారు. అనంతరం ఆమెను వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలు గురమ్మది... చాలా పేద కుటుంబం అని ఇలాంటి అభాగ్యులను వేధింపులకు గురి చేయటం వైకాపా నాయకులకు ఎంత వరకు సబబని గ్రామస్థులు ప్రశ్నించారు.
మధ్యాహ్న భోజన కార్మికురాలి ఆత్మహత్యాయత్నం - suicide attempt in guntur district
గుంటూరు జిల్లా పానకాలపాలెం ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన పథకం వంట మనిషి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానిక వైకాపా నేతల వేధింపులు తాళలేకే ఈ ఘటనకు పాల్పిడినట్లు బాధితురాలి బంధువులు ఆరోపించారు.
'వేధింపులు తాళలేక... మధ్యాహ్న భోజనం వంట మనిషి ఆత్మహత్యాయత్నం'