తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌పై మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని) చేసిన వ్యాఖ్యలను పార్టీ కార్యకర్తలు ఖండించారు. మాటల ద్వారా రెచ్చగొట్టి, దాడి చేసేందుకు ప్రేరేపించే విధంగా వైకాపా నేతలు విమర్శలు చేశారన్నారు. అందుకు తెదేపా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దుస్ పేర్కొన్నారు.
'మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలి'
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని తెనాలి డీఎస్పీ స్రవంతిరాయ్‌కు గుంటూరు జిల్లా తెదేపా నాయకులు వినతిపత్రం అందించారు. తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌పై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యాలకు అతనిపై కేసు నమోదు చేయాలని కోరారు.
తెదేపా కార్యకర్తలు
వైకాపా నేతలు చేసిన విమర్శలు ప్రజాస్వామ్యంలో క్షమించరానివన్నారు. దీన్ని నేరంగా పరిగణిస్తూ కొడాలి నానిపై క్రిమినల్ కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు డీఎస్పీ స్రవంతి రాయ్‌కి వినతి పత్రం అందించారు. ఉన్నతాధికారులకు విషయం తెలియజేసి.. తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి:Chandrababu letter to DGP: 'దాడికి గురైన దళితులపైనే అక్రమ కేసులు'