ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

sucharitha: 'అమర జవాన్ జశ్వంత్​ రెడ్డి సేవలు మరువలేనివి' - గుంటూరు జిల్లా వార్తలు

దేశ సరిహద్దుల్లో ముష్కర మూకలతో పోరాడుతూ అమరుడైన వీర జవాన్​ జశ్వంత్​ కుటుంబానికి హోం మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

sucharitha
అమర జవాన్ జస్వంత్ రెడ్డి సేవలు మరువలేనివి

By

Published : Jul 9, 2021, 4:45 PM IST

దేశ రక్షణకు సేవలందిస్తూ.. ఉగ్రవాదులపై పోరులో మృత్యు ఒడికి చేరిన వీర సైనికుడు జశ్వంత్​ రెడ్డి సేవలు, ధైర్య సాహసాలు, తెగువ వెలకట్టలేనివని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. జశ్వంత్​ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆమె హామీ ఇచ్చారు.

జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో గుంటూరు జిల్లాకు చెందిన సైనికుడు వీరమరణం పొందాడు. రాజౌరీ జిల్లాలో జరిగిన కాల్పుల్లో.. బాపట్ల మండలం దరివాద కొత్తపాలెంకు చెందిన మారుప్రోలు జశ్వంత్ రెడ్డి మరణించారు. కొత్తపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ కుమారుడు జశ్వంత్​ రెడ్డి. మరికొద్ది రోజుల్లో జశ్వంత్​ రెడ్డికి వివాహం చేయాలని భావిస్తున్నలోపే ఉగ్రదాడిలో మరణించాడంటూ.. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

దేశ సేవల్లో చేరిననాటి నుంచి..

జశ్వంత్ రెడ్డి 17 మద్రాస్ రెజ్మెంట్ లో 2016 లో సైనికునిగా చేరారు. శిక్షణ తర్వాత నీలగిరిలో మొదటగా విధులు నిర్వహించిన ఆయన.. అనంతరం జమ్ముకశ్మీర్‌కు వెళ్లారు. అక్కడే విధులు నిర్వహిస్తూ వీరమరణం పొందారు.

ప్రముఖుల సంతాపం:

  • అమరవీరుడికి గవర్నర్, జనసేనాని సంతాపం..

వీర జవాన్ జశ్వంత్ రెడ్డి మృతికి రాష్ట్ర గవర్నర్​ బిశ్వభూషణ్ హరిచందన్​, జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ సంతాపం తెలిపారు.

  • అమరవీరుడికి గవర్నర్, జనసేనాని సంతాపం..

వీర జవాన్ జశ్వంత్ రెడ్డి మృతికి రాష్ట్ర గవర్నర్​ బిశ్వభూషణ్ హరిచందన్​, జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ సంతాపం తెలిపారు.

  • రాష్ట్ర హోం మంత్రి సుచరిత..

విధుల్లో వీర మరణం పొందిన జవాన్​ జశ్వంత్​​కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 50 లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించినట్లు తెలిపారు. జవాన్​ ఆకస్మిక మృతి పట్ల ఆయన కుటుంబసభ్యులకు హోం మంత్రి సుచరిత ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తప్పనిసరిగా ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా ఉంటుందన్నారు.

  • సీఎం జగన్మోహన్​ రెడ్డి..

ఉగ్రవాదులపై పోరులో ప్రాణాలొదిన అమర జవాన్‌ జశ్వంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి జగన్‌ రూ.50 లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ప్రాణత్యాగం చేసిన జవాన్ చిరస్మరణీయుడు అంటూ ఘన నివాళి అర్పించారు. జశ్వంత్‌రెడ్డి దేశ రక్షణలో భాగంగా కశ్మీర్‌లో తన ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేశారన్న జగన్‌... ఆయన త్యాగం నిరూపమైనదన్నారు.

  • జశ్వంత్ రెడ్డికి మాజీ సైనికుల సంఘం సంతాపం..

సరిహద్దుల్లో మరణించిన సైనికుడు జశ్వంత్ రెడ్డికి మాజీ సైనికుల సంఘం సంతాపం తెలిపింది. గుంటూరు జిల్లా బాపట్ల మండలం కొత్తపాలెంలోని జశ్వంత్ రెడ్డి నివాసం వద్ద మాజీ సైనికులు నివాళి అర్పించారు. జశ్వంత్ రెడ్డి మృతదేహం ఇవాళ సాయంత్రానికి స్వగ్రామం చేరుకునే అవకాశం ఉంది. శనివారం నాడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దేశ రక్షణ కోసం జశ్వంత్ రెడ్డి మరణించడం మాజీ సైనికులుగా గర్విస్తున్నట్లు వారు తెలిపారు. జశ్వంత్ రెడ్డి మృతితో శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబసభ్యులు అస్వస్థతకు గురయ్యారు. జశ్వంత్ రెడ్డి తల్లి వెంకటేశ్వరమ్మ సొమ్మసిల్లి పడిపోగా వైద్యులు ఆమెకు చికిత్స అందించారు.

ఇదీ చదవండి:

CM ON JAWAN: అమర జవాన్ జశ్వంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి జగన్‌ నివాళి

ABOUT THE AUTHOR

...view details