పార్టీల ప్రమేయం లేకుండా వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే... తెదేపా శవ రాజకీయాలు చేస్తుందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పర్యటనకు వచ్చిన లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. కాకుమానులో మాట్లాడిన సుచరిత... తెదేపా పాలనలోనే గోవాలపల్లి నాగమణి ఉన్నవ శ్రీనివాస్‌పై కేసు పెట్టిందనీ...2019 ఫిబ్రవరిలో కోర్టులో కేసుపై సాక్షులతో విచారణ జరిగి ఛార్జిషీట్ ఫైల్ చేశారని చెప్పారు. తీర్పు వెలువడే సమయంలో శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఆత్మహత్య చేసుకున్న అతన్ని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా... అప్పుల బాధతో చేసుకున్నాడని మృతుడి భార్య ఫిర్యాదు ఇచ్చినట్లు సుచరిత వెల్లడించారు. మూడు రోజుల తరువాత శ్రీనివాస్ మృతి చెందాడన్నారు. అతని జేబులో సూసైడ్ లేఖ ఉందని... అందులో నాగమణి హింస వలన చనిపోయాడని రాసి ఉన్నట్లుగా చెప్పారన్నారు. ఈ ఆత్మహత్యతో పార్టీలకు, రాజకీయాలకు సంబంధం లేదన్నారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన లోకేశ్ శవ రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు.
'తెదేపా శవ రాజకీయాలు మానుకోవాలి'
తెదేపాపా శవ రాజకీయాలు చేస్తుందని హోంమంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. ప్రత్తిపాడులో వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే వైకాపా నాయకుల వేధింపుల వల్లే చేసుకున్నాడన్న లోకేశ్ వ్యాఖ్యలపై గుంటురు జిల్లా కానుమానులో ఆమె ఘాటుగా స్పందించారు.
లోకేశ్ వ్యాఖ్యలపై స్పందించిన మేకతోటి సుచరిత
Last Updated : Nov 23, 2019, 9:08 AM IST