గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పలలో జూన్ 20న గ్రామానికి చెందిన ఘంటా శ్రీనివాసరావు(వాసు) హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు తెలిపారు. శుక్రవారం దుర్గి పోలీసు స్టేషన్లో డీఎస్పీ శ్రీహరిబాబు మాట్లాడుతూ ఘంటూ వాసు, తోట వాసు కుటుంబాలకు కొన్నేళ్లుగా ఆస్తి ( పొలాలకు సంబంధించిన) వివాదాలున్నాయని చెప్పారు.
హత్య జరిగిన రోజు ఘంటా శ్రీనివాసరావు అడిగొప్పలలోని మీసేవా కేంద్రంలో విధులు నిర్వహిస్తుండగా ప్రత్యర్థి వర్గీయులైన తోట వాసు, ఆయన తనయుడు మల్లికార్జునరావులు ముందుగా పథకం ప్రకారం లోపలికి వెళ్లి కత్తులు, గొడ్డళ్లలో హత్యచేశారన్నారు. నలబోతు వెంకయ్య, వేముల సత్యనారాయణ, పులుకూరి మణికంఠలు వారికి రక్షణగా బయట ఉన్నారని, అనంతరం అందరూ అక్కడి నుంచి పరారయ్యారన్నారు. మాచర్ల గ్రామీణ, పట్టణ సీఐలు భక్తవత్సల రెడ్డి, రాజేశ్వరరావు, ఎస్సై రామాంజనేయులు సిబ్బందితో కలిసి రెండు బృందాలుగా విడిపోయి హత్య కేసులో ఐదుగిరిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. మాచర్ల గ్రామీణ, పట్టణ సీఐలు భక్త వత్సలరెడ్డి, రాజేశ్వరరావు, ఎస్సై రామాంజనేయులు పాల్గొన్నారు.