సమాజానికి తనవంతు సాయం చేయాలనే ఉద్దేశ్యంతో గుంటూరు వైద్య కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 2019లో స్పర్శ అనే ఫౌండేషన్ ను ప్రారంభించారు. స్నేహితులు, కళాశాల అధ్యాపకులు సహకారంతో సేవా కార్యక్రమాలను మొదలుపెట్టారు. ప్రధానంగా విద్య, వైద్యం, పేద వారికి ఉచితంగా ఆహారం అందించడం, విభిన్న ప్రతిభావంతులకు సహాయం చేయటం.. వారిలో ఉన్న సమస్యలపైన అధ్యయనం చేయటం వారికి కావలసిన వైద్య సేవలు అందించటం వంటి పలు అంశాలపై వైద్య కళాశాల విద్యార్థులు దృష్టి సారించారు.
మొదట ఐదుగురితో ప్రారంభమైన పౌండేషన్ ప్రస్తుతం 65 మంది సభ్యులు కలిగి ఉంది. ఫౌండేషన్‌లో ఎక్కువ శాతం మహిళలు భాగస్వాములు కావడం విశేషం. వీరికి సాయంగా పలు ప్రైవేట్ కళాశాల విద్యార్థులు ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.
పాఠశాల విద్యార్ధులకు ప్రేరణ పాఠాలు