ప్రజల భాగస్వామ్యంతో నగరాన్ని క్లీన్ గుంటూరుగా మారుస్తామని మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు తెలిపారు. పరిశుభ్రతను పరిరక్షించే లక్ష్యంతో గుంటూరు బ్రాడీపేటలో ప్రయోగాత్మకంగా స్థానికులకు మూడు చెత్త బుట్టలను ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌తో కలిసి పంపిణీ చేశారు. రెండు బుట్టల్లో తడి, పొడి చెత్తను, మూడో బుట్టలో హానికరమైన వ్యర్థపదార్థాలను సేకరించనుండగా.... ఇంటికే వచ్చి పురపాలక సిబ్బంది వీటిని రోజూ సేకరిస్తారని తెలిపారు.
ఈ విధానం అమలుకు మురికివాడల్లో అయితే ఇంటికి రోజుకు రూ.రెండు, మిగతా చోట్ల రూ.4 చెల్లించాల్సి ఉంటుందని మేయర్ తెలిపారు. నగరంలో రెండు డివిజన్లలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టామని.. భవిష్యత్తులో మిగతావార్డుల్లోనూ ఈ విధానాన్ని అమలుచేస్తామని చెప్పారు. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయం చేయటం మానుకోవాలని మేయర్ శివనాగ మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ అభిప్రాయపడ్డారు.