ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్: మేయర్ - గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు

45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్య క్రమంలో వ్యాక్సిన్ ఇస్తామని గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు. గోరంట్లలోని వ్యాక్సినేషన్​ సెంటర్​ను మేయర్ పరిశీలించారు.

Mayor Manohar Naidu inspected Gorantla vaccination center
వ్యాక్సినేషన్​ సెంటర్​ను పరిశీలించిన మేయర్ కావటి మనోహర్ నాయుడు

By

Published : May 29, 2021, 9:04 PM IST

గుంటూరు నగరంలో 10 శాశ్వత వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటు చేశామని.. వాటితో పాటు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోందని మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు. 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇస్తామన్నారు. ప్రస్తుతం 2వ డోసు వ్యాక్సినేషన్​ కొనసాగుతోందని తెలిపారు. వ్యాక్సినేషన్ వివరాల కోసం, వార్డు సచివాలయాన్ని లేదా వార్డు వాలంటీర్​ను సంప్రదించాలని చెప్పారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియ పర్యవేక్షణ కోసం ప్రత్యేక నోడల్ అధికారులను నియమించామని… వాళ్ల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. స్థానిక కార్పొరేటర్ సైతం అందుబాటులో ఉండి ప్రజలకు వ్యాక్సిన్ అందేలా చూడాలని చెప్పారు. నగర ప్రజలందరికీ వ్యాక్సినేషన్​ చేయిస్తామని.. అయితే కొవిడ్ నిబంధనల మేరకు ప్రజలు సహకరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details