ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

భారతరత్న పురస్కార గ్రహిత, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు పలు జిల్లాల్లో ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యావ్యవస్థలో ఆయన చేసిన విప్లత్మకమైన మార్పులను కొనియాడారు. క్రమశిక్షణ, ఆలోచనతో యువత ముందుకు వెళ్లాలని ఆకాక్షించారు. విద్య ద్వారానే సర్వతోముఖాభివృద్ది సాధ్యమవుతుందన్నారు. ఆజాద్ మైనార్టీల అభ్యున్నతికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహించారు.

maulana-abul-kalam-azad-jayanti-celebrated
ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

By

Published : Nov 11, 2020, 5:32 PM IST

Updated : Nov 11, 2020, 11:04 PM IST

భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి ఎస్పీ అమ్మిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అబుల్ కలాం ఆజాద్​ కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి పదవి చేపట్టిన తరువాత విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని కొనియాడారు. ఆయన జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. క్రమశిక్షణ, ఆలోచనతో సమాజ శ్రేయస్సు కోసం అబుల్ కలాం ఆజాద్ పాటు పడ్డారని, ఆయన బాటలో యువత ముందుకు వెళ్లాలని ఆకాక్షించారు.

కృష్ణా జిల్లాలో...

దేశ విద్యావ్యవస్థను తీర్చిదిద్దిన వ్యక్తి, పరిపాలనదక్షుడు మౌలానా అబుల్‌కలాం ఆజాద్‌ అని కృష్ణా జిల్లా పాలనాధికారి ఏఎండీ ఇంతియాజ్‌ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జాతీయవిద్యా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. 11 ఏళ్లు విద్యాశాఖ మంత్రిగా ఆజాద్‌ ఎనలేని సేవలందించి-జాతీయ విద్యా విధానం అమలు చేశారన్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగానే ఏటా నవంబరు 11వ తేదీని జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మైనారిటీ వర్గాలలో మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ అగ్రస్థానంలో నిలుస్తారన్నారు. రచయితగా, కవిగా, తత్వవేత్తగా, విద్యావేత్తగా, రాజకీయవేత్తగా అనేక సేవలందించారన్నారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఇల్మ్‌ అను లఘుచిత్రం గోడపత్రికను ఆవిష్కరించారు. విద్య ద్వారానే సర్వతోముఖాభివృద్ది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

విశాఖ జిల్లాలో...

మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని వైకాపా నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆజాద్ మైనార్టీల అభ్యున్నతికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పార్టీ స్థానిక అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదగా 100 మంది విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.

కర్నూలులో...

భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు కర్నూలు జిల్లాలో నిరాడంబరంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వీర పాండియన్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆజాద్ చేసిన సేవలను కొనియాడారు.

చిత్తూరులో...

తంబళ్లపల్లి మండల పరిషత్ కార్యాలయంలో కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం జయంతిని అధికారులు నిరాడంబరంగా నిర్వహించారు. ఆయన ఆశయాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. తొలి ప్రధానిగా మైనారిటీల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని ఎంపీడీవో దివాకర్ రెడ్డి, మైనార్టీ నాయకులు కరీం, జమాల్ బాషా, కరీం తెలిపారు.

ఇదీ చదవండి:

'కేసులు ఉపసంహరించుకోండి.. టిడ్కో ఇళ్లు పంచుతాం'

Last Updated : Nov 11, 2020, 11:04 PM IST

ABOUT THE AUTHOR

...view details