భాజపా ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశ విధానాల వల్ల తెలుగు రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. సంస్కరణలు పేరుతో రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. గుంటూరు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించి రాష్ట్రానికి అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా.. ఈనెల 26న తలపెట్టిన భారత్ బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. కార్మిక, రైతు సంఘాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుందన్నారు.
'26న తలపెట్టిన భారత్ బంద్కు కాంగ్రెస్ మద్దతు' - గుంటూరు జిల్లాలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి వ్యాఖ్యలు
పార్లమెంట్ సాక్షిగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్నట్లు ప్రకటించినా.. వైకాపా, తెదేపా నేతలు చోద్యం చూస్తున్నారే తప్ప.. అడ్డుకోవడం లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి తెలిపారు. ఈనెల 26న తలపెట్టిన భారత్ బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు.
పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి