గుంటూరు జిల్లా మంగళగిరిలో తొలి విడతగా నాలుగున్నర లక్షల మాస్కులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని కరోనా పాజిటివ్ కేసు నమోదైన టిప్పర్ల బజార్లో మంగళగిరి పురపాలక సంఘం కమిషనర్ హేమమాలిని పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం, పురపాలక సంఘం అధికారులు ఎంతో కృషి చేస్తున్నారని కమిషనర్ ప్రశంసించారు. మరో 3 రోజుల్లో పట్టణమంతటా అందజేస్తామని చెప్పారు.
మంగళగిరిలో ఇంటింటికీ ప్రభుత్వ మాస్కులు పంపిణీ - మంగళగిరిలో ప్రభుత్వ మాస్కులు పంపిణీ
కుటుంబంలో ఒక్కో సభ్యునికి 3 మాస్కులు అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంగళగిరిలో తొలి విడతగా మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని పురపాలక సంఘం కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ప్రభుత్వ మాస్కులు పంపిణీ చేస్తున్న పురపాలక కమిషనర్