ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి.. భర్తే కారణమా? - గుంటూరులో మహిళ మృతి తాజా వార్తలు

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామం ఎస్టీ కాలనీలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె భర్తపైనే బాధిత కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు.

married woman suspected death
మహిళ అనుమానస్పద మృతి

By

Published : May 11, 2020, 1:38 PM IST

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామం ఎస్టీ కాలనీకి చెందిన వివాహిత మేడా భవాని (20).. అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. మంగళగిరి మండలం కాజా గ్రామానికి చెందిన ఆమెకు.. సొలస గ్రామానికి చెందిన తోకల వీరాంజనేయులతో ఐదేళ్ల కింద వివాహమైంది. వీరికి పిల్లలు లేని కారణంగా.. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్టు సమాచారం.

నాలుగు నెలల కిందట భవాని పుట్టింటికి వెళ్ళింది. పెద్దలు దంపతులకు సఖ్యత కుదర్చగా... ఉన్నవ గ్రామంలోని ఎస్టీ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. ఆదివారం రాత్రి 10 గంటలకు దంపతులు ఇరువురు మాట్లాడుకున్నారు. అనంతరం భవానీ నిర్జీవంగా మంచంపై పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తన కుమార్తెను ఆమె భర్త, కుటుంబ సభ్యులే హతమార్చారని మృతురాలి తల్లి పార్వతి ఆరోపిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details