నరసరావుపేట మండలం ఇస్సపాలెం గ్రామంలో ఒక వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం సృష్టించింది. ఇస్సపాలెం గ్రామానికి చెందిన మక్కెల అశ్విని(19).. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమమించిన బంధువులు అశ్వినిని వెంటనే నరసరావుపేట పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. అశ్విని మృతికి భర్త, ఆడబిడ్డ వేధింపులే కారణమని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. గ్రామీణ పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని మృతురాలి బంధువులకు సర్దిచెప్పి వారి వద్ద ఫిర్యాదు తీసుకున్నారు.