ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడు మతాల సాక్షిగా ఒక్కటయ్యారు! - గుంటూరులో మూడు మత ఆచారాల్లో పెళ్లి తాజా వార్తలు

పెళ్లి అనేది ఎవరి జీవితంలో అయినా ముఖ్యమైన సందర్భం. అందుకే వివాహాన్ని మరపురాని జ్ఞాపకంగా మార్చుకోవాలని భావించింది ఆ జంట. అందుకోసం మూడు మతాచారాల ప్రకారం పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.

మూడు మతాల సాక్షిగా ఒక్కటయ్యారు!
మూడు మతాల సాక్షిగా ఒక్కటయ్యారు!

By

Published : Nov 22, 2020, 10:06 AM IST

Updated : Nov 22, 2020, 11:08 AM IST

మూడు మతాల సాక్షిగా ఒక్కటయ్యారు!

గుంటూరు జిల్లా తెనాలి.. అరుదైన వివాహ వేడుకకు వేదికైంది. తెనాలికి చెందిన పూలివర్తి దిలీప్ కుమార్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. హైదరాబాద్ లో ఏరోఫాల్కన్ ఏవియేషన్ పేరిట సంస్థను నిర్వహిస్తున్నారు. దిలీప్​కు హైదరాబాద్​కు చెందిన కమలాబాయితో వివాహం కుదిరింది.

తమ పెళ్లిని ఎప్పటికీ మరచిపోలేని విధంగా చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించారు. ఈ మేరకు 21వ తేదిన తెనాలిలోని గౌతం గ్రాండ్ హోటల్లో మూడు మతాచారాల ప్రకారం వివాహ కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు బంధుమిత్రుల సమక్షంలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పాస్టర్ దీవెనల మధ్య వివాహం జరిగింది. సాయంత్రం ముస్లిం మతపెద్దలు చేసిన దువాతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. రాత్రి హిందూ విధానంలో వధువు మెడలో దిలీప్ తాళి కట్టారు. ఇలా మూడు సంప్రదాయాలు అనుసరించి దిలీప్, కమల దంపతులయ్యారు.

Last Updated : Nov 22, 2020, 11:08 AM IST

ABOUT THE AUTHOR

...view details