పిల్లలు లేరంటూ సూటిపోటి మాటలు.... రోడ్డుపైకి వెళ్తే అందరూ తప్పుకుని వెళ్లటం.... శుభ కార్యాలకు పిలుపులు లేకపోవటం ఇవన్నీ మంగాయమ్మ దంపతుల్ని ఎంతగానో బాధించాయి. ఎలాగైనా సంతానాన్ని పొందాలన్న ఆలోచన ఆమెలో పెరిగింది. 73 ఏళ్ల వయసులోనూ ధైర్యం చేసింది. కృత్రిమ గర్భధారణను ఎంచుకుంది. చివరికి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి... ఇన్నాళ్లూ పడిన ఆవేదనను దూరం చేసుకుంది. మంగాయమ్మ ఆరోగ్యం, ప్రసవం విషయంలో వైద్యులు చూపిన ఆప్యాయత.... శ్రద్ధ... ఎప్పటికీ మరువలేనని ఆమె భర్త రాజారావు చెప్పారు. పుట్టిన ఇద్దరూ అమ్మాయిలే అయినా తనకు ఎలాంటి బాధ లేదని... వారిలో ఒకరిని దేశ సేవకు... మరొకరిని ఆధ్యాత్మిక సేవకు పంపిస్తానని అన్నారు. ఈ దిశగా ఆయన ఇప్పటి నుంచే ప్రణాళికలు వేస్తున్నారు. పిల్లలు కలగాలని ఎంతో మంది వైద్యులను సంప్రదించినా ఫలితం రాలేదని.. గుంటూరుకు చెందిన వైద్యులు ఉమాశంకర్.. ఆధునిక వైద్యం సాయంతో తమ వేదన తీర్చారని చెప్పారు.
సంబంధిత కథనాలు