గుంటూరు జిల్లా మంగళగిరిలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంపై అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించారు. నిర్బంధ కర్ఫ్యూ విధించారు. పాజిటివ్ కేసున్న టిప్పర్ల బజార్‌తో బయట వాళ్లు రాకుండా నిరోధించారు. ప్రాంతానికి వెళ్లే రహదారులన్నీ మూసేశారు. పరిసర ప్రాంతాల్లో వాలంటీర్లతో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఇతరులెవరైనా కరోనా లక్షణాలతో బాధ పడుతున్నారా అని ఆరా తీశారు. ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటిపై హైపో ద్రావణాన్ని చల్లారు. పోలీసులు, పురపాలక సంఘం అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
మంగళగిరిలో రెడ్‌జోన్‌గా టిప్పర్ బజార్ - manglagiri tipper bazar is in redzone
మంగళగిరిలో కరోనా పాజిటివ్ ఉన్న ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా అధికారులు గుర్తించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆ ప్రాంతానికి వెళ్లే రహదారులన్నీ మూసేశారు.

టిప్పర్ బజార్ ప్రాంతం రెడ్‌జోన్