తెలంగాణ నుంచి మద్యం తీసుకొస్తున్న ముగ్గురు యువకులను గుంటూరు జిల్లా మంగళగిరి ఎస్ఈబీ అధికారులు అరెస్టు చేశారు. తాడేపల్లి ప్రకాశం బ్యారేజ్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్ఈబీ అధికారులకు ఓ వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. ఎస్ఈబీ అధికారులను చూసి వెనక్కి తిప్పుకుంటున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇందులో ఉన్న 100 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం ఆర్డర్ ఇచ్చిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీఐ ప్రమీలారాణి తెలిపారు.
తెలంగాణ మద్యం పట్టివేత... ముగ్గురు అరెస్ట్ - తెలంగాణ అక్రమ మద్యం పట్టివేత
తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను మంగళగిరి ఎస్ఈబీ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 100 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

మంగళగిరిలో అక్రమ మద్యం పట్టివేత