గుంటూరు జిల్లా మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. 15వ వార్డులో విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలో విద్యుత్ ఉప కేంద్రం నిర్మించవద్దని శాసనసభ్యుడికి తేల్చిచెప్పారు. ఎమ్మెల్యే రాకముందే భూమిపూజ చేసే చోటును అధికారులు వచ్చి పరిశీలించగా... స్థానికులు వాళ్లను అడ్డుకున్నారు. దీంతో అధికారులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
మంగళగిరిలో వైకాపా ఎమ్మెల్యేను అడ్డుకున్న స్థానికులు - managalagiri news
మంగళగిరిలోని 15వ వార్డులో విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. తాము ఈ ప్రాంతంలో కబేళా ఏర్పాటు చేసుకున్నామని... విద్యుత్ ఉప కేంద్రం నిర్మించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళగిరిలో వైకాపా ఎమ్మెల్యేను అడ్డుకున్న స్థానికులు
గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో కబేళా ఏర్పాటు చేసుకున్నామని... ఇప్పుడు ఉపకేంద్రం నిర్మిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని స్థానికులు ఎమ్మెల్యేకు తెలియజేశారు. స్థానికులు అభ్యంతరం చెప్పినా.. ఇక్కడ నిర్మాణం చేపట్టేందుకు పురపాలక శాఖ అనుమతి ఉందన్న ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఇవీ చదవండి:'మంత్రి బొత్స సోదరుడు మా భూమిని ఆక్రమిస్తున్నాడు'
Last Updated : Jun 29, 2020, 7:57 PM IST