గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్లో రోజుకి 200లకు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో.. అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ నిరంజన్ రెడ్డి, కొవిడ్ ఇన్సిడెంట్ కమాండెంట్ రామ్ ప్రసాద్ ఇతర అధికారులతో చర్చించారు. మంగళగిరిలోని 32కు గాను 24 వార్డుల్లో మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తహసీల్దార్ రామ్ ప్రసాద్ ప్రకటించారు. మండలంలో వడ్లపూడి, నూతక్కి, రామచంద్రాపురం, కాజ, చినకాకాని, ఆత్మకూరుల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తున్నామన్నారు.
మంగళగిరిలోని పలు గ్రామాల్లో పది రోజులపాటు లాక్డౌన్ - మంగళగిరిలో పది రోజులపాటు లాక్డౌన్
పది రోజులపాటు పలు గ్రామాల్లో లాక్డౌన్ విధిస్తున్నట్లు.. గుంటూరు జిల్లా మంగళగిరి తహసీల్దార్ రామ్ ప్రసాద్ వెల్లడించారు. మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్లో రోజూ 200లకు పైగా కొవిడ్ కేసులు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ నెల 28 నుంచి ఆయా జోన్లలో లాక్డౌన్ నిబంధనలు అమల్లోకి వస్తాయమని రామ్ ప్రసాద్ తెలిపారు. ఇక్కడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు, రేపటిలోపు నిత్యావసర సరుకులు, కూరగాయలు సమకూర్చుకోవాలని సూచించారు. 10రోజులపాటు ఇవే నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. తర్వాత పరిస్థితిని బట్టి పొడగింపు లేదా పాక్షికంగా సడలించే అవకాశాన్ని పరిశీలస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:రెమిడెసివర్ కోసం రాజకీయ నాయకుల రికమండేషన్లు..సరికాదంటున్న వైద్యులు