ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Mangalagiri Corporation Works: హవ్వా.. ఇదేం విడ్డూరం.. విస్తుగొలుపుతున్న అధికారుల తీరు ! - మంగళగిరి నగరపాలక సంస్థ అధికారులు

Mangalagiri Corporation Works: గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి నగరపాలిక పరిధిలో టెండర్‌ ప్రక్రియ పూర్తవకముందే రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేయడం విస్తుగొలుపుతోంది.టెండర్ గడువు ముగియకుండానే ఓ గుత్తేదారు సాయంతో.. పనులు ప్రారంభించి పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అసలు పనులు చేసిందెవరని ప్రశ్నిస్తే.. తనకూ తెలియదని కమిషనర్ నిరంజన్ రెడ్డి చెప్పడం ఆశ్చర్యపరుస్తోంది.

విస్తుగొలుపుతున్న నగరపాలిక అధికారుల తీరు
విస్తుగొలుపుతున్న నగరపాలిక అధికారుల తీరు

By

Published : Dec 6, 2021, 8:36 PM IST

విస్తుగొలుపుతున్న నగరపాలిక అధికారుల తీరు

Mangalagiri Corporation Works: గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి నగరపాలిక పరిధిలో టెండర్‌ ప్రక్రియ పూర్తవకముందే పనులు పూర్తిచేయడం విస్తుగొలుపుతోంది. మంగళగిరిలోని..గౌతమ బుద్ధ రోడ్డు విస్తరణలో భాగంగా మధ్యలో ఉన్న డివైడర్‌ను తొలగించడం, అప్పటికే ఉన్నచెట్లు వేరేచోట నాటడం, మట్టి తొలగించడం వంటి పనులకు 16 లక్షల రూపాయలతో టెండర్లు ఆహ్వానించారు. ఈనెల 4లోపు టెండర్లు దాఖలు చేయాలని పేర్కొన్నారు.

అయితే ఆ టెండర్‌ ఎవరికి వచ్చిందో కూడా తెలియకుండానే పనులు పూర్తయ్యాయి. టెండర్ గడువు ముగియకుండానే ఓ గుత్తేదారు సాయంతో.. పనులు ప్రారంభించి పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అసలు పనులు చేసిందెవరని ప్రశ్నిస్తే.. తనకూ తెలియదని కమిషనర్ నిరంజన్ రెడ్డి చెప్పడం ఆశ్చర్యపరుస్తోంది.

ఇదీ చదవండి : CM Jagan On Paddy Crop: అక్కడ వరికి బదులు.. ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details