రాంకీ గ్రూప్ సంస్థలో తనపై వచ్చిన ఆరోపణలను గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఖండించారు. రాంకీలో తన పేరుతో ఉన్న 12వేల షేర్లను ఎవరికీ విక్రయించలేదని... దీనిపై ప్రతిపక్షపార్టీ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారణమైనవని ఆయన అన్నారు. ఎక్కడా ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదని....అలాంటి అవసరం లేదని స్పష్టం చేశారు. దీనిని తెలుగుదేశం పార్టీ నేతలు నిరూపించాలని సవాల్ విసిరారు.
ఆ సంస్థలో నేను షేర్లు కొనలేదు: మంగళగిరి ఎమ్మెల్యే - Ramky Group Company
రాంకీ గ్రూప్ సంస్థ విషయమై తెదేపా నేతలు తన మీద చేస్తున్న ఆరోపణలని గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కొట్టిపారేశారు. ఏ ఒక్క రోజు అవినీతికి పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు.
మంగళగిరి ఎమ్మెల్యే
ఐటీ అధికారులు తన ఇంటిపై దాడులు జరిపారని...అందులో నిబంధనల మేరకు నా దగ్గర ఉండాల్సిన మొత్తం కన్నా ఎక్కువ లేదన్నారు. ఐటీ దాడుల్లో రూ. 4లక్షల23వేలు మాత్రమే దొరికాయని....అవి తన దగ్గర వదిలేసి రసీదు ఇచ్చారని చెప్పారు.
ఇదీ చూడండి.పంచలింగాల చెక్ పోస్టు వద్ద 7 కిలోల బంగారం పట్టివేత