స్వర్ణకార వృత్తిని ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో తొలిసారిగా గుంటూరు జిల్లా మంగళగిరిలో స్వర్ణకార భవన్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. మంగళగిరి గండాలయపేటలో ఎకరం స్థలంలో... 5 అంతస్తుల స్వర్ణకార భవన్‌ను నిర్మించబోతున్నామని వెల్లడించారు. మంగళగిరిలో దాదాపు 10 వేల మంది స్వర్ణకారులున్నారని.. లాక్డౌన్ వల్ల వీరంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
స్వర్ణకారులను ఆదుకునేందుకు ఓ భవనం నిర్మించాలని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు మంగళగిరిలో ఎకరా స్థలాన్ని సీఎం మంజూరు చేశారు. ఈ భవనంలో ఏయే సదుపాయాలుండాలి? గదులు ఎంత పరిమాణంలో ఉండాలనే అంశాలపై ఎమ్మెల్యే ఆర్కే స్వర్ణకారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చేనెలలో స్వర్ణకార భవన్ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని ఆర్కే తెలిపారు.