మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ విచారణకు హాజరయ్యారు. విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. అధికారుల ప్రశ్నలకు ఆయన జవాబు చెబుతున్నారు.
రాజధాని ప్రాంతంలో ఎస్సీలకు సంబంధించిన భూముల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఎమ్మెల్యే ఆర్కే.. గత నెల సీఐడీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐడీ.. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణతో పాటు.. ఆళ్లకు సైతం నోటీసులు జారీ చేసింది. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆళ్లకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. అమరావతి భూములకు సంబంధించిన ఆధారాలుంటే చూపాలని పేర్కొన్నారు.