గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌లో మౌలిక సదుపాయాల నిర్మాణ పనులను వారం రోజుల్లో ప్రారంభించాలని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎయిమ్స్ సంచాలకులు డాక్టర్ ముఖేష్ త్రిపాఠితో ఆళ్ల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. మంగళగిరి గౌతమబుద్ధ రోడ్డు నుంచి ఎయిమ్స్ వరకు వెళ్లే మార్గంలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వైద్యాధికారులతో కలిసి ఎయిమ్స్ పరిసరాలను సందర్శించారు.
'వారం రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభించాలి' - మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణారెడ్డి
గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌ను స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సందర్శించారు. ఎయిమ్స్‌లో మౌలిక సదుపాయాల నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
!['వారం రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభించాలి' mangalagiri mla alla ramakrishna reddy inspect to mangalagiri aims](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10522744-865-10522744-1612605301865.jpg)
మంగళగిరి ఎయిమ్స్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి