ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీఎన్​ఎస్​ఎఫ్ నేతలకు రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు - టీఎన్​ఎస్​ఎఫ్ నేతలు వార్తలు

పోలీసులు తమపై అన్యాయంగా అత్యాచార కేసులు బనాయించారని.. టీఎన్​ఎస్​ఎఫ్​ నేతలు ఆరోపించారు. శనివారం సీఎం జగన్ ఇంటి ముట్టడికి యత్నించిన వారికి మంగళగిరి కోర్టు రిమాండ్ విధించింది. ఎప్పుడూ పేద విద్యార్థుల పక్షం పోరాడే తమపై.. పోలీసులు ఇలా తప్పుడు కేసులు బనాయించడం సరికాదని అన్నారు.

Mangalagiri court gives remand to TNSF leaders
టీఎన్​ఎస్​ఎఫ్ నేతలకు రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు

By

Published : Jan 24, 2021, 8:29 AM IST

టీఎన్​ఎస్​ఎఫ్ నేతలకు రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు

సీఎం జగన్ ఇంటి ముట్టడికి యత్నించిన తెలుగునాడు విద్యార్థి సంఘాల నేతలకు మంగళగిరి కోర్టు రిమాండ్ విధించింది. వీరిని అరెస్టు చేసిన తర్వాత తాడేపల్లి పోలీసులు అత్యాచారం కేసు బనాయించారు. విద్యార్థి నేతలు అత్యాచారయత్నం చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పరిశీలించిన న్యాయమూర్తి.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ రిమాండ్ రిపోర్ట్ సరిచేసి తీసుకురావాలని సూచించిన మేరకు.. పోలీసులు మరో నివేదికను సిద్ధం చేసి న్యాయమూర్తి ముందుంచారు.

విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. టీఎన్​ఎస్​ఎఫ్ నేతలకు రిమాండ్ విధించారు. ఈ నిర్ణయంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎప్పుడూ పేద విద్యార్థుల పక్షం పోరాడే తమపై.. తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. కేవలం నోటీసు ఇచ్చి పంపుతామని చెప్పి.. ఇలా రిమాండ్‌కు పంపడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎవరికీ ఆటంకం కల్పించకపోయినా.. పోలీసులు అన్యాయంగా తమపై కేసులు పెట్టారని వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details