గుంటూరు జిల్లా మంగళగిరిలో నారా లోకేశ్ సతీమణి బ్రహ్మణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళగిరి చేనేత వస్త్రాలకు, బంగారు ఆభరణాలకు అంతర్జాతీయ గర్తింపు రావాలంటే లోకేశ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నియోజకవర్గాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేసి రూపురేఖలు మారుస్తామన్నారు. ఇంటింటికి తాగునీరందించే పథకాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమానికి పెద్దపీట వేసే తెదేపాకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ సతీమణి పద్మతో పాటు భారీ సంఖ్యలో మహిళ కార్యకర్తలు పాల్గొన్నారు.
మంగళగిరికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తాం: బ్రహ్మణి - మంగళగిరి
మంగళగిరి రూపురేఖలు మారాలంటే మంత్రి లోకేశ్‌ను గెలిపించాలని ఆయన సతీమణి నారా బ్రహ్మణి ప్రజలను కోరారు. తెదేపా అధికారంలోకి వస్తే మంగళగిరికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామన్నారు.
నారా బ్రహ్మణి ప్రచారం