తెలంగాణలో దిశ ఎన్ కౌంటర్‌ను సమర్థించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్రంలో ఆ సూత్రాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. గుంటూరులో అత్యాచారానికి గురైన బాలికను ప్రభుత్వాస్పత్రిలో పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మందకృష్ణ ధ్వజమెత్తారు. తెలంగాణలో పేద బీసీ వర్గాలకు చెందిన నిందితుల ఎన్‌కౌంటర్‌ను సీఎం హర్షించారని.. మరి రాష్ట్రంలోని ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీలపై జరిగిన అత్యాచారాలపై మాత్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే అన్ని చోట్లా ఒకే న్యాయం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల సీఎం ఎందుకు వివక్ష చూపుతున్నారని నిలదీశారు. అత్యాచార నిందితుణ్ని కఠినంగా శిక్షించాలని మందకృష్ణ అన్నారు. అంబేడ్కర్ వారసులుగా ప్రతీకార హత్యను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించిన మాజీ ఎంపీ హర్షకుమార్‌ను 48 గంటల్లోగా విడుదల చేయాలని... లేకుంటే గుంటూరు వేదికగా ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.
'ముఖ్యమంత్రి గారూ అక్కడ సమర్థిస్తారు.. ఇక్కడ అమలు చేయరా..?'
అత్యాచారాలకు పాల్పడే నిందితులకు కఠిన శిక్షలు అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలో అత్యాచార బాధితురాలిని పరామర్శించారు. ఈ ఘటనపై జగన్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
గుంటూరులో సీఎం జగన్ పై మండిపడ్డ మందకృష్ణ మాదిగ