మందడంలో పరిస్థితి ఉద్రిక్తం..భారీగా మోహరించిన పోలీసులు - మందడంలో పరిస్థితి ఉద్రిక్తం
మందడంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ధర్నా శిబిరం నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చారు రైతులు. మందడంలోని వీధుల్లో జై అమరావతి నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఎక్కడికక్కడ ముళ్ల కంచెలు వేసి, భారీగా పోలీసుల మోహరించారు.
mandadam-farmers-dharna
రైతులందరూ దీక్షా శిబిరం నుంచి ఒక్కసారిగా బయటకు రావడంతో మందడంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రైతులు, మహిళలు వీధుల్లో జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రజల్ని ఆపేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ ముళ్ల కంచెలతో జనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ర్యాలీలో రమణమ్మ అనే మహిళ కిందపడి గాయపడింది.