ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగనన్న రోడ్డు గుంతలు - నడ్డి విరుగుడు' అంటూ నిరసన - మంచికలపూడి గ్రామస్థుల వినూత్న నిరసన

రహదారికి మరమ్మతులు కోరుతూ... గుంటూరు జిల్లాలోని మంచికలపూడి గ్రామస్తులు వినూత్న నిరసన తెలిపారు. 'జగనన్న రోడ్డు గుంతలు - నడ్డి విరుగుడు' అని ఫ్లెక్సీ పట్టుకుని నిరసన చేశారు.

Manchikalapudi villegers staged an innovative protest demanding repairs to the village road.
రహదారికి మరమ్మతులు కోరుతూ గ్రామస్థుల వినూత్న నిరసన

By

Published : Nov 25, 2020, 12:29 PM IST

గ్రామ రహదారికి మరమ్మతులు చేయించాలంటూ గుంటూరు జిల్లా మంచికలపూడి వాసులు వినూత్నంగా నిరసన తెలిపారు. 'జగనన్న రోడ్డు గుంతలు - నడ్డి విరుగుడు' అంటూ ఫ్లెక్సీతో ఆందోళనకు దిగారు. దుగ్గిరాల నుంచి తమ గ్రామానికి వెళ్లే మార్గమంతా గుంతలు ఏర్పడటం వల్ల... వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవల వచ్చినా పట్టించుకోలేదని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details