గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఆంధ్రా బ్యాంకులో జరిగిన బంగారం గోల్మాల్ విషయంలో...బ్యాంకు అధికారుల పాత్ర లేకుండా ఏది జరగదని మణప్పురం గోల్డ్ సంస్థ ప్రాంతీయ మేనేజర్ జాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆంధ్రా బ్యాంకులో ప్రైవేటు అప్రయిజర్గా 15 ఏళ్ల నుంచి పని చేస్తున్న షేక్ నాగూర్ వలి.. ఖాతాదారుల బంగారాన్ని మణప్పురం గోల్డ్ సంస్థలో 500 గ్రాములకు పైగా తాకట్టు పెట్టినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం 10 నుంచి 12 లక్షల వరకూ బంగారంపై.. నగదు తీసికెళ్లినట్లు తెలిపారు. బ్యాంకు అధికారుల సహకారం లేకుండా ఇలా చేసే అవకాశం లేదని అనుమానం వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారులు వచ్చి తమ ఉద్యోగాలు పోతాయి... బంగారాన్ని తీసుకెళ్తామని చెప్పినట్లు ఆయన మీడియాకు చెప్పారు. తమ సిబ్బంది గతంలో బ్యాంకు అధికారులను నాగూర్వలి గురించి ఆరా తీశారని, అయితే బ్యాంకు అధికారులు అతనికి బాసటగా నిలిచారని అన్నారు. నగదు చెల్లిస్తే బంగారం ఇస్తామని చెప్పారు.
'బ్యాంకు అధికారుల సహకారం లేకుండా ఇలా జరగదు' - prathipadu andra bank issue latest news in telugu
ఆంధ్రా బ్యాంకులో జరిగిన బంగారం గోల్మాల్పై మణప్పురం గోల్డ్ సంస్థ ప్రాంతీయ మేనేజర్ జాల్ రెడ్డి స్పందించారు. ఆంధ్రా బ్యాంకు అధికారుల ప్రమేయం లేకుండా ఇలా జరిగే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు.
!['బ్యాంకు అధికారుల సహకారం లేకుండా ఇలా జరగదు' Manappuram Gold Regional Manager Jal Reddy respond on prathipadu andra bank issue in guntur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6065153-163-6065153-1581618621171.jpg)
'బ్యాంకు అధికారుల సహకారం లేకుండా ఇలా జరగదు'
'బ్యాంకు అధికారుల సహకారం లేకుండా ఇలా జరగదు'