దేశీయ వంగడాలను మళ్లీ వినియోగంలోకి తెచ్చేందుకు గుంటూరు జిల్లా కొల్లిపోర మండలంలో మన ఊరు మన విత్తనం కార్యక్రమాన్ని చేపట్టారు. హైబ్రిడ్ రకాలు రాకముందున్న వంగడాల్ని రైతులకు పరిచయం చేయటంతో పాటు వాటితో వ్యవసాయం చేసేలా ప్రోత్సహించటం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, రైతు సాధికార సంస్థ ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ...దేశీయ విత్తనాలను ఉపయోగించి వ్యవసాయం చేయటం ద్వారా పెట్టుబడులు బాగా తగ్గుతాయన్నారు. అలాగే ఈ విధానంలో ఆరోగ్యకరమైన ఆహారం పండించవచ్చని... ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఈ సమాజానికి ఎంతో మేలు చేసినవారవుతారని వారు వ్యాఖ్యానించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి వ్యవసాయం చేసిన చరిత్ర గుంటూరు రైతులకు ఉందని ఎమ్మెల్యే శివకుమార్ అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధకి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని వివరించారు. ఈ సందర్భంగా ప్రదర్శనకు ఉంచిన 200 రకాల దేశీవాలి వరి వంగడాల్ని వారు సందర్శించారు.
దేశీయ వంగడాల కోసమే మన ఊరు-మన విత్తనం - tenali mla
గుంటూరు జిల్లాలో దేశీయ వంగడాలను మళ్లీ వినియోగంలోకి తెచ్చేందుకు మన ఊరు-మన విత్తనం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ హాజరయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి వ్యవసాయం చేసిన చరిత్ర గుంటూరు రైతులకు ఉందని ఆయన అన్నారు.
మళ్లీ వినియోగంలోకి రానున్న దేశీయ వంగడాలు