గుంటూరు జిల్లా కాకుమాను మండలం రేటూరు గ్రామానికి చెందిన వ్యక్తి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు షేక్ ఇమామ్ బాషాగా పోలీసులు గుర్తించారు. కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసిన బాషా భయాందోళనకు గురై.. బాపట్ల మండలం జమ్ములపాలెం రోడ్డులో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కరోనా నిర్ధరణ..భయాందోళనతో వ్యక్తి బలవన్మరణం - man died due to corona fear latest news
తనకు కరోనా సోకిందని తెలుసుకున్న షేక్ ఇమామ్ బాషా భయాందోళనకు గురై చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బాపట్ల మండలంలో జరిగింది.

కరోనా పాజిటివ్ వచ్చిందనే భయంతో ఆత్మహత్య