గుంటూరు జిల్లా తెనాలి మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో గోపి అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. కోపల్లె గ్రామానికి చెందిన గోపి..... చెంచుపేటకు చెందిన ఓ మహిళతో ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. చీటీ డబ్బు విషయంలో ఇద్దరి మధ్యా గొడవ తలెత్తగా..రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై గోపీని పోలీసులు స్టేషన్ కు పిలిపించి మాట్లాడుతుండగా.. తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగినట్లు పోలీసులు తెలిపారు. హుటాహుటిన తెనాలి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో.. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
విచారణ నిమిత్తం పిలిస్తే..ఆత్మహత్యకు యత్నించాడు - గుంటూరు తాజా వార్తలు
తెనాలి మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఓ కేసు విషయంలో విచారణ చేస్తుంటే..అతను పురుగుల మందు తాగాడు.
తెనాలిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం