ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోర్టు ఎదుట పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం - guntur district crime

ఆటోమొబైల్స్ నిర్వాహకుల ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి న్యాయస్థానం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎదుట జరిగింది.

man suicide attempt at vinukonda court guntur district
కోర్టు ఎదుట పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

By

Published : Mar 25, 2021, 5:38 PM IST

గుంటూరు జిల్లా వినుకొండ పట్టణానికి చెందిన మస్తాన్ వలీ... ఓ ఆటోమొబైల్స్ ఫైనాన్స్ లో 2015 -17 సంవత్సరానికి 3 ట్రాక్టర్లు, ఒక ద్విచక్రవాహనం తీసుకున్నాడు. వీటికి సంబంధించి పూర్తి నగదు చెల్లించినప్పటికీ... ఖాళీ చెక్కులతో కోర్టులో కేసులు వేసి, ఆటోమొబైల్స్ నిర్వాహకులు ఇబ్బందికి గురిచేస్తున్నారని బాధితుడు వాపోయారు.

తన కుటుంబసభ్యులతోనూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి తమ వద్ద ఫోన్ వాయిస్ రికార్డులు ఉన్నాయని బాధితుడు తెలిపారు. వేధింపులు తాళలేక న్యాయస్థానం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మస్తాన్ వలీ తెలిపారు. ఈ ఘటనపై 2019లో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details