ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

suicide: మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య..ఎక్సైజ్​ పోలీసుల వైఖరే కారణమా !

పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మనస్థాపంతో ఓ వ్యక్తి.. పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు.. గురువారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనను నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు.

By

Published : Aug 6, 2021, 6:01 PM IST

Updated : Aug 6, 2021, 8:22 PM IST

suicide
ఆత్మహత్య

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం భట్రుపాలెం గ్రామానికి చెందిన అలీషా తన కారులో అక్రమంగా తెలంగాణ మద్యాన్ని తరలిస్తున్నట్లు గురజాల ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నాడని అలీషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనస్తాపం చెందిన అలీషా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అలీషా గురువారం రాత్రి మృతి చెందాడు.

మద్యం తరలిస్తున్న వాహనం తమది కాదని చెబుతున్నా వినకుండా పోలీసులు అలీషాను అరెస్ట్ చేశారని.. అతనిపై చేయి చేసుకున్నారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుని కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అలీషా మృతికి గురజాల ఎక్సైజ్ పోలీసులే కారణమని కుటుంబసభ్యులు ఆరోపించారు. దాచేపల్లిలో షేక్ అలీషా మృతదేహంతో బంధువులు ధర్నా చేపట్టారు. భారీ సంఖ్యలో ముస్లింలు, గ్రామ ప్రజలు రోడ్డుపైకి వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

కొట్టి చంపే నేర‌మైతే కాదు..

అబ్దుల్‌ సలాం ఘటన మరువకముందే జగన్‌రెడ్డి ప్రభుత్వం మరో మైనార్టీ సోదరుడు అలీషాను అన్యాయంగా చంపేసిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా భట్రుపాలెంలో ప‌క్కరాష్ట్రం నుంచి మ‌ద్యం త‌ర‌లిస్తున్నార‌నే నెపంతో అలీషాని కొట్టి చంపారని మండిపడ్డారు. అక్రమ మద్యం తరలించ‌డం.. కొట్టి చంపేంత నేర‌మైతే, విష‌పూరిత‌మైన సొంత‌ మ‌ద్యాన్ని అత్యధిక ధ‌ర‌ల‌కు అమ్ముతూ.. జ‌నాల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్న జ‌గ‌న్‌రెడ్డిది ఇంకెంత పెద్ద నేర‌మో ఎక్సైజ్ పోలీసులు చెప్పాలన్నారు. అలీషా కుటుంబసభ్యులకు 50లక్షల రూపాయల పరిహారం చెల్లించి, హంత‌కుల్ని ఉద్యోగాల నుంచి తొల‌గించాలని కోరారు.

ఇదీ చదవండి

SUICIDE ATTEMPT: హోటల్ గదిలో గొంతు కోసుకొని.. ఇద్దరు ఆత్మహత్యాయత్నం !

Last Updated : Aug 6, 2021, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details