గుంటూరు జిల్లా కాకుమాను మండలం బోడిపాలెం గ్రామానికి చెందిన నన్నపనేని శివ రామ ప్రసాద్ (54) వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో పాటు ఆర్ధిక ఇబ్బందులు ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సౌందర్య రాజన్ తెలిపారు. మంగళవారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిన అతను బుధవారం సాయంత్రం పొలాల వద్ద ఉరి వేసుకుని కనిపించాడు. భార్య రాజేశ్వరి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని బాపట్లకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
అప్పుల బాధతో ఉరివేసుకోని వ్యక్తి ఆత్మహత్య - man sucide at guntur district
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా కాకుమాను మండలంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల బాధతో ఉరివేసుకోని వ్యక్తి ఆత్మహత్య