Man Protest With Sandals in Guntur: సీఎం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదంటూ గుంటూరు పోలీసు కార్యాలయం వద్ద మంగళగిరి మండలం నవులూరుకు చెందిన బరిగల కోటేశ్వరరావు అనే వ్యక్తి మెడలో చెప్పుల దండతో నిరసన తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తనకు రెండు పెట్రోలు బంకులు ఉన్నాయని.. తన భార్య సెల్ఫోన్ పాడైతే బాగు చేయడం కోసం మహేశ్ అనే వ్యక్తికి ఇచ్చినట్లు కోటేశ్వరరావు తెలిపారు. అందులో తన భార్య ఫొటోలు, వీడియోలు ఉన్నాయని.. అవి బయట పెట్టకుండా ఉండాలంటే రూ.9 లక్షలు ఇవ్వాలని తనని బెదిరించి మహేశ్ డబ్బులు తీసుకున్నాడని ఆరోపించారు.
Man Protest Protest with Sandals in Guntur SP Office: అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల.. అందుకు కక్ష పెట్టుకొని తన భార్యను ట్రాప్ చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన తన భార్య తనను నమ్మించి రూ.2 కోట్లు తీసుకొని, ఆమె పేరుతో ఆస్తులు కూడబెట్టిందని తెలిపారు. తరువాత ఇద్దరూ కలిసి తనకు ఆహారంలో విషం పెట్టి చంపాలని చూశారని ఆరోపించారు. దీనిపై తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా, చర్యలు తీసుకోలేదని వాపోయారు. 2022లో అక్టోబరు 11, 2023 మార్చి 6 తేదీల్లో సీఎం 'స్పందన'లో ' ఫిర్యాదు చేసినా, న్యాయం జరగలేదని వాపోయారు.
Katrapadu Sarpanch Cycle Yatra for Panchayat Funds: పంచాయతీ నిధుల కోసం సర్పంచ్ వినూత్న నిరసన
Guntur Man Protest With Sandals: అనంతరం గుంటూరు పోలీసు కార్యాలయం స్పందనలో ఫిర్యాదు చేశానని.. అయినా పోలీసులు నిందితులను అరెస్టు చేయడం లేదన్నారు. అదేమని తాడేపల్లి సీఐ శేషగిరిరావును అడిగితే, తాను సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తానని, తనకు ముఖ్యమంత్రి ఆశీర్వాదం ఉందంటూ వ్యంగ్యంగా మాట్లాడి అవమానపరిచారని వివరించారు. మహేష్ ఓ వైసీపీ నాయకుడి అనుచరుడు కావడంతోనే పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని..ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని కోటేశ్వరరావు కోరారు.