ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యక్తిపై యువకుల దాడి..ముగ్గురు అరెస్ట్​.. - attack on man

కొంతమంది యువకులు ఆడుకుంటున్నారు. అక్కడికి ఓ వ్యక్తి వెళ్లాడు. అంతదాకా ఆటలో ఉన్న వారికి ఏమయ్యిందో ఏమో..వ్యక్తిపై దాడికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

youth attacks a man
వ్యక్తిపై యువకుల దాడి

By

Published : Oct 24, 2020, 8:20 AM IST

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలో కొంతమంది యువకులు కరప్ప అనే వ్యక్తిపై దాడి చేశారు. దాడికి పాల్పడిన వారిలో ముగ్గురుని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వారు నల్లపాడుకు చెందినవారని అనుమానిస్తున్నట్లు చెప్పారు.

పోలీసుల వివరాల ప్రకారం:

పేరేచర్ల శివారు కొండ ప్రాంతంలో కొంతమంది క్రికెట్ ఆడుతున్నారు. ఆరవ మైలుకు చెందిన కరప్ప అక్కడకు వెళ్లాడు. ఉన్నట్టుండి యువకులు అతనిపై దాడి చేసి, గాయపరిచారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాదితుడిని చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: భగ్గుమన్న కుటుంబ కలహాలు... వియ్యంకులపై దాడి..

ABOUT THE AUTHOR

...view details