ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మురుగు కాల్వలో పడి.. వైద్యం అందక వ్యక్తి మృతి - person died in diranage guntoor news

కరోనా వైరస్ మానవత్వాన్ని దూరం చేస్తోంది. ఆపదలో వున్నా వైరస్ కారణంగా.. ఎవరి దగ్గరికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా.. బిక్షాటన చేసే ఓ వ్యక్తి సకాలంలో వైద్యం అందకపోవడంతో కొన్ని గంటలపాటు కొన ఊపిరితో కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాడు.

మురుగు కాల్వలో పడి.. వైద్యం అందక వ్యక్తి మృతి
మురుగు కాల్వలో పడి.. వైద్యం అందక వ్యక్తి మృతి

By

Published : Jul 28, 2020, 11:44 PM IST

గుంటూరు సంగడిగుంట కొత్తరెడ్డి పేటకు చెందిన దాసరి కోటేశ్వరరావు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు దగ్గరకు రానివ్వలేదు. నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద భిక్షాటన చేసుకుంటూ అక్కడే బతుకుతున్నాడు. గత శనివారం రాత్రి ఈదురు గాలులతో పాటు భారీ వర్షం కురిసింది ఈ వర్షంలో కోటేశ్వరరావు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న మురుగు కాలువలో పడిపోయారు. స్థానికులు గమనించి పురపాలకశాఖ అధికారులకు సమాచారం అందించారు.

మురుగు కాలువలో ఉన్న వ్యక్తిని బయటకు తీసి నేలపై పడుకోబెట్టారు. కరోనా కారణంగా దగ్గరకు వెళ్లలేదు. వైద్యం అందక చివరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ... కోటేశ్వరరావు మృతి చెందాడు. ఆయన మృతి చెందినట్లు స్థానికులు మరోసారి పోలీసులకు సమాచారం చేరవేశారు పోలీసులు వచ్చి అతని జేబులో పరిశీలించడంతో ఆధార్ కార్డు దొరికింది. దాని ఆధారంగా అతని సమాచారాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. బంధువులు మృతదేహాన్ని తీసుకెళ్లారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details