గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని నరగాయపాలెం గ్రామంలో విద్యుత్ షాక్తో మృతి చెందిన వ్యక్తి మృతదేహంతో గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. సచివాలయానికి మట్టితో వెళ్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి దుర్మరణం చెందగా.. ట్రాక్టర్ దగ్ధమైంది. చనిపోయిన వ్యక్తికి న్యాయం చేయాలంటూ గ్రామస్థులు, బంధువులు శివయ్య స్థూపం సెంటర్లో ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. రామాంజనేయులు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి.. సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి.. న్యాయం చేయాలంటూ గ్రామస్థుల ఆందోళన - గుంటూరు జిల్లాలో విద్యుత్ షాక్ మృతులు తాజా వార్తలు
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. సచివాలయం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే విద్యుత్ ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చేందాడని గ్రామస్థులు ఆరోపించారు.
న్యాయం చేయాలంటూ గ్రామస్థులు ఆందోళన