గుంటూరు జిల్లా నగరం మండలం నున్న గ్రామంలో విద్యుదాఘాతానికి గురై.. ఓ వ్యక్తి మృతి చెందాడు. దాసరిపాలెం గ్రామానికి చెందిన నున్న శ్రీనివాసరావు (47) అనే వ్యక్తి.. కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వర్షానికి తెగిపడిన కేబుల్ వైర్‌ను సరిచేసేందుకు విద్యుత్ స్తంభం ఎక్కాడు.
కేబుల్ వైర్లు సరిచేస్తుండగా.. ప్రమాదవశాత్తు కరెంటు తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.